Fri Dec 05 2025 13:35:42 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : బెంగళూరులో విషాదం.. ఆర్సీబీ విజయోత్సవ సంబరాల్లో ఎనిమిది మంది మృతి?
బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఎనిమిది మరణించినట్లు తెలిసింది

బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఎనిమిది మరణించినట్లు తెలిసింది. అయితే అధికారికంగా ఇద్దరు మాత్రమే మరణించినట్లు చెబుతున్నారు.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. పది మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. దాదాపు యాభై మంది మందికి గాయాలయ్యాయి. నిన్న జరిగిన ఐపీఎల్ ఫైనల్స్ లో పంజబ్ కింగ్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. పద్దెనిమిదేళ్ల తర్వాత లభించిన విజయాన్ని ఆర్సీబీ ఫ్యాన్స్ నిన్న రాత్రి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విధాన సౌధ నుంచి చిన్న స్వామి స్టేడియానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సభ్యులు వస్తున్నారని తెలిసి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
స్టేడియానికి వస్తున్నారని తెలిసి..
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలసిన అనంతరం ఊరేగింపుగా చిన్న స్వామి స్టేడియంకు రావాల్సి ఉంది. చిన్న స్వామి స్టేడియానికి పెద్ద సంఖ్యలో తరలి రావడంతో వారిని అదుపు చేయడంలో కర్ణాటక పోలీసులు విఫలమయ్యారు. స్వల్పంగా లాఠీఛార్జీ కూడా చేశారు.ఒక్కసారిగా అభిమనులు దూసుకు రావడంతో పాటు బ్యారికేడ్లు తొలగించుకుని మరీ ముందుకు దూసుకు రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఆరుగురు తీవ్రంగా గాయపడి మరణించినట్లు చెబుతున్నారు. యాభై మందికి పైగా గాయాలు పడటంతో వారందరికీ సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.
బ్యారికేడ్లు తోసుకుని రావడంతో...
అయితే భద్రతా కారణాల దృష్ట్యా విక్టరీ పరేడ్ ను ప్రభుత్వం రద్దు చేసింది. కేవలం చిన్న స్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సభ్యులకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. అయితే స్టేడియానికి జట్టు సభ్యులు వస్తారని తెలిసిన అభిమానులు పెద్దయెత్తున తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో ఇద్దరికి తొక్కిసలాటలో గాయాలయ్యాయి. తొక్కిసలాటలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బెంగళూరు ఎయిర్ పోర్టులో ఆర్సీబీ జట్టుకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్వాగతం పలికారు. తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు తరలి వచ్చిన వేల సంఖ్యలో అభిమానులను పోలీసులు కట్టడి చేయలేకపోయారు. విజయోత్సవంలో చివరకు విషాదం మిగిలింది.
Next Story

