Sat Jul 12 2025 22:14:05 GMT+0000 (Coordinated Universal Time)
Covid Virus : వేగంగా వ్యాపిస్తున్న కరోనా...ఇప్పటి వరకూ ఎంత మంది మరణించారంటే?
కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజూకూ ఎక్కువగా కనపడుతుంది. యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది.

కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజూకూ ఎక్కువగా కనపడుతుంది. యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ కరోనా వైరస్ తో ఇప్పటి వరకూ 32 మంది చనిపోయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. కరోనా వైరస్ ఈ ఏడాది ఆరంభం నుంచి ఎక్కువగా ఉంది. అయితే మే నెల చివరి నుంచి వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
యాక్టివ్ కేసులు ఎన్నంటే?
ప్రస్తుతం ఉన్న వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ఇప్పటి వరకూ భారత్ లో 3,921 యాక్టివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇరవై నాలుగు గంటల్లో కరోనా వైరస్ వ్యాధి కారణంగా ఇద్దరు మరణించారని తెలిపింది. అత్యధికంగా కేరళలో 1,435 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని చెప్పింది. గత ఇరవై నాలుగు గంటల్లోనే దేశ వ్యాప్తంగా 360 కొత్త కేసులు నమోదయ్యాయని భారత వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మహారాష్ట్రలో 560, ఢిల్లీలో 483, పశ్చిమ బెంగాల్ లో 339, గుజరాత్ లో 338, తమిళనాడులో 199, ఉత్తర్ ప్రదేశ్ లో 149, ఒడిశా, గురుగ్రామ్ లో పన్నెండు, పంజాబ్ లో ఆరు కేసులు నమోదయ్యాయని, మహారాష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా ఏడుగురు మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
డిశ్చార్జ్ అయినా...
కరోనా వైరస్ బారిన పడి ఇప్పటి వరకూ 2,188 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. కేరళ, కర్ణాటకలో కోవిడ్ వల్ల తాజాగా ఇద్దరు మరణించడంతో అక్కడి ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అయితే ఈ వేరియంట్ పెద్ద ప్రమాదకరం కాదని, లక్షణాలు కూడా పెద్దగా కనిపించడం లేదని, అయితే ఇతర రకాల ఆరోగ్య సమస్యలున్న వారు మాత్రం జాగ్రత్తలు పాటించాల్సిందేనని పేర్కొంది. కేసుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వాలు ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కూడా పేర్కొంది. కరోనా ప్రత్యేక వార్డులను ఏర్పాటుచేసుకోవాలని, ప్రజల్లోనూ అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
Next Story