Fri Dec 05 2025 13:37:53 GMT+0000 (Coordinated Universal Time)
Corona Virus : ఈ రాష్ట్రాలకు వెళుతున్నారా? అయితే మాస్క్ లు ధరించాల్సిందే
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. కేసుల సంఖ్య ప్రతి రోజూ పెరుగుతుంది

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. కేసుల సంఖ్య ప్రతి రోజూ పెరుగుతుంది. నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు ప్రారంభం కావడంతో పాటు చల్లని వాతావరణం ఏర్పడటం, వర్షాలు కురుస్తుండటంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. భారత్ లో మే 25వ తేదీ నుంచి కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. మరణాల సంఖ్య కూడా ఎక్కువ అవుతుండటంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్ర వైద్య శాఖలను అప్రమత్తం చేసింది. అవసరమైన కోవిడ్ బెడ్స్ ను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.
లక్షణాలివే...
ప్రధానంగా ఈరకం వేరియంట్ ప్రమాదకరం కాదని చెబుతున్నప్పటికీ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. దీర్ఘకాలిక రోగులు, వృద్ధులు ఎక్కువగా మరణిస్తున్నారని చెబుతున్నారు. అయితే జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు, విరేచనాలు వంటివి ఉంటే వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. జనసమూహాల్లోకి వచ్చేటప్పుడు మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని, శానిటైజర్స్ ను కూడా వాడటం వల్ల వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చని చెబుతుంది.
ఇక్కడకు వెళితే...
భారత్ లో గడచిన ఇరవై నాలుగు గంటల్లో 101 మంది పాజిటివ్ గా తేలింది. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పదకొండు మంది మరణించారు. దీంతో భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 7,264కు చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ ఈ ఏడాది కరోనా కారణంగా 108 మంది మరణించారని కూడా భారత ప్రభుత్వం వెల్లడించింది. అత్యధికంగా కేరళలో 1,920, గుజరాత్ లో 1,433, పశ్చిమ బెంగాల్ లో 747, ఢిల్లీలో 649, కర్ణాటకలో 591, మహారాష్ట్రలో540, ఉత్తర్ ప్రదేశ్ లో 275, రాజస్థఆన్ లో 222, తమిళనాడులో 220 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. ఈ రాష్ట్రాలకు వెళ్లే వారు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Next Story

