Fri Aug 12 2022 06:26:12 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో కరోనా కేసులు ఎన్నంటే?

భారత్ లో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. ఒకరోజు తగ్గడం మరోరోజు కేసుల సంఖ్య పెరగడం జరుగుతుంది. అధికారులు మాత్రం ప్రజలు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. ఒక్కరోజులో 16,135 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా కారణంగా 24 మంది మరణించారు. నిన్న ఒక్క రోజులో 13,958 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ శాతం 4.85 శాతానికి పెరిగినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కోలుకున్న వారి శాతం 98.54 శాతంగా ఉందని చెబుతున్నారు.
యాక్టివ్ కేసులు...
దేశంలో ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 4,28,79,477 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ భారత్ లో 5,25,223 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 1,13,864 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు వెల్లడించారు. ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకూ 1,97,98,21,197 వ్యాక్సిన్ డోసులు వేశారు.
Next Story