Mon Dec 08 2025 18:43:27 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి స్వల్పంగా తగ్గింది. ఒక్కరోజులోనే 16,464 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు.

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి స్వల్పంగా తగ్గింది. ఒక్కరోజులోనే 16,464 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 39 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో 16,112 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కరోనా పాజిటివ్ రేటు 98.48 శాతంగా నమోదయింది.
యాక్టివ్ కేసులు....
దేశంలో ఇప్పటి వరకూ మొత్తం 4,40,36,275 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇప్పటి వరకూ 4,33,65,890 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ దేశంలో 5,26,396 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 1,43,989 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ 204.34 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు వెల్లడించారు.
Next Story

