Sat Dec 13 2025 22:30:56 GMT+0000 (Coordinated Universal Time)
ఇంజన్లో లోపం.. అత్యవసరంగా విమానం ల్యాండింగ్
ముంబయి నుంచి కోల్‌కతాకు వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది

ముంబయి నుంచి కోల్‌కతాకు వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. విమానంలోని ఒక ఇంజిన్ లోపాన్ని గుర్తించి అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు కోల్‌కతా విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానం సురక్షితంగా దిగిందని పేర్కొన్నారు. ఇటీవలి నవంబర్ 7వ తేదీన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాంకేతిక సమస్య వల్ల విమానాల రాకపోకల్లో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ సహా పలు ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు ఆలస్యాలపై ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి.
విమానాల రాకపోకల్లో ఆలస్యం...
ఢిల్లీ విమానాశ్రయ అధికారులు సమచారం ప్రకారం, సుమారు 100 విమానాలు ఆలస్యంగా నడిచాయి. ప్రయాణికులు బయలుదేరే ముందు తమ విమాన స్థితి తెలుసుకోవాలని ఎయిర్‌లైన్స్ సూచించాయి. సిబ్బంది ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించేందుకు సహకరిస్తున్నారని కంపెనీలు తెలిపాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లో సాంకేతిక లోపం కారణంగా ఈ అంతరాయం ఏర్పడింది. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని, విమానం స్వయంగా టెర్మినల్ వరకు చేరిందని స్పైస్‌జెట్ ప్రతినిధి తెలిపారు.
Next Story

