Fri Feb 14 2025 11:30:53 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికా ప్రత్యేక విమానంలో ఎంత మంది భారతీయులు ఉన్నారంటే?
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని తరలించేందుకు ప్రత్యేక విమానం బయలుదేరిం

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని తరలించేందుకు ప్రత్యేక విమానం బయలుదేరింది. కొద్ది గంటల్లోనే ఈ విమానం భారత్ కు చేరుకుంటుంది. 150 మందికి పైగా ఈ విమానంలో ఉన్నారని తెలిసింది. అయితే దీనిపై పూర్తిగా క్లారిటీ లేదు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తిస్తున్న అధికారులు వారిని ప్రత్యేక విమానాల్లో వారి దేశాలకు పంపిస్తున్నారు.
ప్రత్యేక విమానంలో...
భారత్ కు సీ 17 విమానంలో అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్న వారిని తరలిస్తున్నారు. ఈ ఆపరేషన్ నిరంతరం కొనసాగుతుందని అమెరికా ప్రభుత్వం చెబుతుంది. అమెరికా నుంచి తరలించేందుకు ఒక్కొక్క వ్యక్తిపై అమెరికా ప్రభుత్వం 4,675 డాలర్లను ఖర్చు చేస్తుందని అధికారుల తెలిపారు. అమెరికాలోని ప్రధాన నగరాలైన టెక్సాస్, శాస్ డియాగో, కాలిఫోర్నియాలో అక్రమంగా ఉంటున్న దాదాపు ఐదు వేల మందిని వారి దేశాలకు తరలిస్తున్నారు.
Next Story