Thu Mar 12 2026 15:38:54 GMT+0530 (India Standard Time)
లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా ఏమన్నారంటే?
లోక్సభకు స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు

లోక్సభకు స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. ఆయనపై విపక్షాలు పెట్టిన అవిశ్వాసం వీగిపోవడంతో ఈరోజు సభకు వచ్చి ఆయన మాట్లాడారు. విపక్షాల గొంతు నొక్కుతున్నానని తనపై ఆరోపణలు చేశారని, అవిశ్వాస తీర్మానంపై 12 గంటలకు పైగా చర్చ జరిగిందని, విపక్షాలు మాట్లాడినప్పుడే ప్రజాస్వామ్యం గెలుస్తుందని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.
ప్రతిపక్షానికి కూడా...
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి కూడా సరైన ప్రాతినిధ్యం ఉంటుందని, సభలో కూడా వారికి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ పార్లమెంట్ 140 కోట్ల భారతీయులకు ప్రతిబింబమని గుర్తుంచుకోవాలని స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. సభా నియమాలకు కట్టుబడి అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వడం జరుగుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు.
Next Story

