Wed Dec 17 2025 06:43:07 GMT+0000 (Coordinated Universal Time)
విక్రమ్ మిస్రీపై ట్రోలింగ్ .. బాధ్యత ఉందా అసలు?
పాకిస్తాన్ తో కాల్పుల విరమణకు కారణమంటూ విదేశాంగ కార్య దర్శి విక్రమ్ మిస్రీపై కొందరు ట్రోలింగ్ కు పాల్పడ్డారు

పాకిస్తాన్ తో కాల్పుల విరమణకు కారణమంటూ విదేశాంగ కార్య దర్శి విక్రమ్ మిస్రీపై కొందరు ట్రోలింగ్ కు పాల్పడ్డారు. పాకిస్తాన్ తో కాల్పుల విరమణ ఒప్పందానికి కారకుడంటూ ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా కించపరుస్తూ అనేకమంది పోస్టులు చేస్తుండటంతో విక్రమ్ మిస్రీ తన ఎక్స్ ఖాతాను లాక్ చేశారు. ఆయన ప్రభుత్వ విధానాన్ని మాత్రం తెలియజేసే సంథాన కర్తగా ఉన్నారు. అంతే తప్పించి కాల్పలు విరమణ నిర్ణయానికి ఆయన బాధ్యుడు ఎలా అవుతారని పలువురు ప్రశ్నిస్తున్నార.
అండగా నిలిచినా...
విక్రమ్ మిస్రీకి చాలా మంది రాజకీయ నేతలు అండగా నిలిచారు. విక్రమ్ మిస్రి గత ఏడాది జూలై 15న భారత విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు . 1989 బ్యాచ్ కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి అయిన మిస్రీ, విదేశాంగ మంత్రిత్వ శాఖలో , న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో మరియు యూరప్, ఆఫ్రికా, ఆసియా మరియు ఉత్తర అమెరికాలోని వివిధ భారతీయ మిషన్లలో వివిధ హోదాల్లో పనిచేశారు.మిస్రీని లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేస్తున్న వారిని అరెస్ట్ చేయాలన్న డిమాండ్ వినపడుతుంది.
Next Story

