Sun Apr 05 2026 17:08:42 GMT+0530 (India Standard Time)
Himachal pradesh మంచు కురిసే వేళలో
హిమాచల్ ప్రదేశ్లో మంచు కురుస్తుంది.

హిమాచల్ ప్రదేశ్లో మంచు కురుస్తుంది. దీంతో పర్యాటకులు పోటెత్తుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ రోహ్తంగ్ పాస్లో భారీగా మంచు కురుస్తోంది. అటల్ టన్నెల్, కులు-మనాలీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి.
పోటెత్తిన పర్యాటకులు...
ఈ అద్భుత దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. వాహన దారులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పర్యాటకులు అత్యధిక సంఖ్యలో వస్తుండటంతో వారు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
Next Story

