Sat Mar 07 2026 21:55:40 GMT+0530 (India Standard Time)
కాశ్మీర్లో మంచుతుఫాను .. ఒకరి మృతి
జమ్మూ కాశ్మీర్ మంచు తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఈ మంచు తుఫాను కారణంగా ఒకరు మరణించారు

జమ్మూ కాశ్మీర్ మంచు తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఈ మంచు తుఫాను కారణంగా ఒకరు మరణించారు. ప్రజలు బయటకు రావడానికే భయపడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జమ్మూకాశ్మీర్ లో మంచుతుఫాను వణికిస్తుంది. ఈ మంచుతుఫాన్ లో చిక్కుకుని గుల్మార్గ్లో ఒకరు మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
పర్యాటకులు కూడా...
మంచు తుఫాను తీవ్రం కావడంతో పర్యాటకులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంజాయ్ చేయడానికి వచ్చిన పర్యాటకులు హోటల్ గదులకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక రోడ్లు కూడా మంచుతో మూసుకుని పోయాయి. అనేక చోట్ల రవాణా సౌకర్యానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రయాణం కష్టంగా మారిందని చెబుతున్నారు.
Next Story

