Sun Apr 05 2026 15:58:31 GMT+0530 (India Standard Time)
Gas Cylinder : కిరాణా దుకాణాల్లోనూ గ్యాస్ సిలిండర్లు.. విన్నూత్న ప్రయోగం
పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో ఎల్.పి.జి గ్యాస్ సమస్య ఎక్కువగా ఉంది

పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో ఎల్.పి.జి గ్యాస్ సమస్య ఎక్కువగా ఉంది. దీంతో భారతీయ కంపెనీలు కొత్త మార్గాన్ని కనిపెట్టాయి. తక్కువ కిలోలున్న సిలెండర్లను మార్కెట్ లోకి ప్రవేశపెట్టాయి. భారత్, హెచ్.పి.ఇండేన్ గ్యాస్ చమురు సంస్థలు ఐదు కిలోల సిలెండర్ల ధరలను ప్రవేశెుట్టాయి. గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతూ వినియోగదారులు గ్యాస్ సిలిండర్ల కోసం ఇబ్బందులు పడుతున్న సమయంలో చమురు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్ పీ గ్యాస్ కంపెనీలన్నీ ఈ చిన్న సిలిండర్లను మార్కెట్లోకి తెచ్చాయి.
నిబంధనలు లేకుండానే...
అయితే ఈ గ్యాస్ సిలిండర్లను సులువుగా తీసుకోవచ్చు. కనెక్షన్ కూడా సులువుగా తీసుకోవచ్చు. అడ్రస్ కూడా అవసరం లేదు.ఇప్పటివరకు గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే అడ్రస్ ఫ్రూఫ్ అవసరం. అలాగే దరఖాస్తులు నింపాల్సి వచ్చేది. అయితే 5 కిలోల గ్యాస్ సిలిండర్ తీసుకోవాలంటే ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ సమర్పించాల్సిన అవసరం లేదు. కేవలం ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుంది. మీ సమీపంలోని ఏ గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి అయినా అప్పటికప్పుడు దీనిని తీసుకుని వెళ్లవచ్చు. గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్‌కు ముందే బుక్ చేసుకుంటే ఇంటికి రావడానికి సమయం పడుతుంది. అదే ఈ చిన్న సిలిండర్‌ను మీ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి లేదా సమీపంలోని దుకాణాల్లో సులువుగా రీఫిల్లింగ్ చేసుకునే వీలుంది.
వివిధ పేర్లతో...
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఛోటు పేరుతో ఐదు కిలోల సిలిండర్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. పెట్రెల్ పంపులు, కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లు, ఇండేన్ పంపిణీదారుల వద్ద దీనిని కొనుగోలు చేసే వీలుంటుంది. ఏ నగరంలో అయినా దీనిని వినియోగించుకోవచ్చు. ఇక భారత్ గ్యాస్ మినీ సిలిండర్ అయితే ఇంటి వద్దకే వచ్చేస్తుంది. 1800224344 నెంబర్‌కు కాల్ చేస్తే రెండు గంటల్లోనే ఇంటికి డెలివరీ చేస్తారు . అయితే ఇరవై డెలివరీ ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. ఇక హెచ్ పీ గ్యాస్ అప్పు పేరుతో ఐదు కేజీ ల సిలిండర్‌ను ప్రవేశపెట్టింది. పెట్రోల్ బంక్‌లు, విక్రయ కేంద్రాలు, కిరాణా దుకాణాల్లో దీనిని పొందవచ్చు. సలువుగా వీటిని ఎక్కడి నుంచైనా మరొక చోటకు తీసుకెళ్లే వీలుంది.
Next Story

