Wed Mar 18 2026 11:16:31 GMT+0530 (India Standard Time)
సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మృతి
టాటా గ్రూపు మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించారు

టాటా గ్రూపు మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన తన కారులో అహ్మదాబాద్ నుంచి ముంబైకి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని పాల్టర్ జిల్లాలో సూర్య నది వంతెనపై ఈ దుర్ఘటన జరిగింది. వంతెనపై ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టడంతో సైరస్ మిస్త్రీ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో సైరస్ మిస్త్రీతో పాటు కారులో ఉన్న మరొకరు కూడా మరణించారు. అత్యంత వేగంతో కారు డివైడర్ ను ఢీకొట్టడంతోనే మృతి చెందారు.
ప్రస్తుతం పల్గొంజీ గ్రూపు ఛైర్మన్ గా...
సైరస్ మిస్త్రీ ప్రస్తుతం షాపూర్ జీ - పల్గొంజీ గ్రూపు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. వ్యాపార దిగ్గజం పల్గొంజీ తనయుడు సైరస్ మిస్త్రీ, ఆయన 1968 జులై 4 జన్మించారు. రతన్ టాటాతో విభేదించి ఆయన బయటకు వచ్చి పల్గొంజీ గ్రూపు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. సైరస్ మిస్త్రీ మరణంతో వ్యాపార వర్గాల్లో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలువురు వాణిజ్య ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.
Next Story

