Fri Dec 05 2025 19:56:20 GMT+0000 (Coordinated Universal Time)
Simi Garewal: భావోద్వేగ వీడ్కోలు పలికిన రతన్ టాటా మాజీ ప్రేయసి
రతన్ టాటా మరణంపై ఆయన మాజీ ప్రేయసి సిమి గరేవాల్

దిగ్గజ పారిశ్రామికవేత్త రాటా టాటా బుధవారం రాత్రి 86 ఏళ్ల వయసులో కన్నుమూశారు. టాటా గ్రూప్‌ను ప్రపంచ వేదికపైకి తీసుకురావడంలో ఆయన చేసిన కృషి, దాతృత్వ కార్యక్రమాలను దేశ పౌరులు ఎప్పటికీ మరచిపోరు. ఆయన మరణవార్త తెలిసిన దేశ ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. టాటా గ్రూప్ చాలా మంది జీవితాలలో భాగమైంది. చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. చాలా మంది ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
రతన్ టాటా మరణంపై ఆయన మాజీ ప్రేయసి సిమి గరేవాల్ కూడా భావోద్వేగ వీడ్కోలు పలికారు. మీరు చనిపోయారని చాలా మంది అంటున్నారంటూ సిమి గరేవాల్ ట్వీట్ చేశారు. "మీ నష్టాన్ని భర్తీ చేయడం చాలా కష్టం.. వీడ్కోలు నా మిత్రమా.. # రతన్ టాటా" అని ట్వీట్ చేశారు సిమి గరేవాల్.
సిమి రతన్ టాటా తనతో కొంతకాలం డేటింగ్ చేసినట్లు అంగీకరించారు. వారు తరువాత కొన్ని కారణాల వల్ల విడిపోయారు కానీ సన్నిహిత స్నేహితులుగా కొనసాగారు. ఆమె 2011లో ఒక ఇంటర్వ్యూలో రతన్ టాటా వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.
Next Story

