Sun Mar 15 2026 15:00:44 GMT+0530 (India Standard Time)
ఇద్దరూ ప్రమాణం చేసేశారు
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రమాణం చేయించారు

కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రమాణం చేయించారు. కంఠీరవ స్టేడియంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారంలో లక్షలాది మంది అభిమానులు హాజరయ్యారు. వారి సమక్షంలో ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.
ముఖ్యనేతల సమక్షంలో..
ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీతో పాటుగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. వీరితో పాటు ఎనిమిది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
Next Story

