Sat Mar 21 2026 22:11:50 GMT+0530 (India Standard Time)
జనవరి 1న పసిడి ప్రియులకు షాక్
పసిడి ప్రియులకు కొత్త ఏడాది మొదటి రోజే షాకింగ్ న్యూస్. బంగారం ధరలు పెరిగాయి.

పసిడి ప్రియులకు కొత్త ఏడాది మొదటి రోజే షాకింగ్ న్యూస్. బంగారం ధరలు పెరిగాయి. గత రెండు మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కొత్త ఏడాది కావడం, అంతర్జాతీయ మార్కెట్ ను అనుసరించి బంగారం ధరలు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. కొత్త ఏడాది బంగారం ధరలు కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ధరలు పెరిగాయి.
ధరలు ఇలా....
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో పెరిగిన బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,100 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,200 రూపాయలుగా ఉంది. బంగారం ధరలు ఒక్కసారిగా పెరగడంతో నూతన సంవత్సరం మొదటి రోజు పుత్తడి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇబ్బందేనని చెప్పక తప్పదు.
Next Story

