Fri Dec 05 2025 14:18:34 GMT+0000 (Coordinated Universal Time)
సూరత్ టు అహ్మాదాబాద్.. క్యాంప్ మార్చిన ఎమ్మెల్యేలు
సూరత్ నుంచి శివసేన రెబల్ ఎమ్మెల్యేలు అహ్మదాబాద్ కు బయలుదేరారు. బీజేపీ కేంద్ర పెద్దలను కలిసే అవకాశముంది

సూరత్ నుంచి శివసేన రెబల్ ఎమ్మెల్యేలు అహ్మదాబాద్ కు బయలుదేరారు. శివసేనకు చెందిన 12 మంది, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు అసంతృప్తికి కారణమైన ఏక్నాధ్ షిండే నేతృత్వం వహిస్తున్నారు. ఈ క్యాంప్ లో మరికొందరు చేరే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. తనకు 80 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉందని ఏక్నాధ్ షిండే చెబుతున్నారు. అయితే అంత మంది లేరని, షిండే మైండ్ గేమ్ మొదలు పెట్టారని శివసేన అంటోంది.
కూల్చివేసేందుకు...
మరోవైపు మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శివసేన పార్టీ నేత సంజయ్ రౌత్ అన్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు ముందుగా బేజీపీ తమ ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీంతో ఉద్ధవ్ థాక్రే పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర భేటీ అయ్యారు. ఎన్సీపీ అధినేత కూడా మధ్యాహ్నం రెండు గంటలకు పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. క్యాంప్ లలో ఉన్న ఎమ్మెల్యేలతో సంప్రదించడానికి శివసేన చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో శివసేన సర్కార్ లో కొంత టెన్షన్ మొదలయింది.
Next Story

