Mon Feb 02 2026 00:16:51 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఈడీ ఎదుటకు రౌత్
శివసేన నేత సంజయ్ రౌత్ నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరు కానున్నారు.

శివసేన నేత సంజయ్ రౌత్ నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరు కానున్నారు. మనీలాండరింగ్ విషయంపై రౌత్ ను ఈడీ అధికారులు విచారించనున్నారు. సంజయ్ రౌత్ తనకు రెండు వారాల పాటు విచారణకు హాజరు నుంచి మినహాయించాలని కోరినప్పటికీ ఈడీ అధికారులు అంగీకరించలేదు.
వేధింపుల్లో భాగంగానే....
దీంతో నేడు సంజయ్ రౌత్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. మహారాష్ట్ర రాజకీయాల్లో క్లారిటీ వచ్చిన తర్వాత సంజయ్ రౌత్ ఈడీ విచారణకు వెళుతున్నారు. ఆయన శివసేన అధినేత ఉద్థవ్ థాక్రే కు సన్నిహితుడిగా ఉండటంతోనే ఈడీ కేసులతో వేధిస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
Next Story

