Tue Mar 24 2026 00:09:25 GMT+0530 (India Standard Time)
ఎంపీ నవనీత్ కౌర్ రాణా దంపతులపై మరో కీలక కేసు.. దావూద్ గ్యాంగ్ తో లింకులు ?
ఇటీవల సీఎం ఉద్ధవ్ థాకరే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠనం వివాదంలో వారిద్దరిపై కేసు నమోదు చేసి, రిమాండ్ కు..

ముంబై : మాజీ సినీ నటి, అమ్రావతి ఎంపి నవనీత్ కౌర్ రాణా దంపతులపై మరో కీలక కేసు నమోదు కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సీఎం ఉద్ధవ్ థాకరే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠనం వివాదంలో వారిద్దరిపై కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా.. నవనీత్, రాణాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బొంబాయి బాంబు పేలుళ్ల ప్రధాన నిందితుడు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో నవనీత్ దంపతులు సంబంధాలు కలిగి ఉన్నట్లుగా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎంపీ సంజయ్ రౌత్ ఫిర్యాదు ఆధారంగా నవనీత్ దంపతులపై మరో కేసు నమోదు చేసేందుకు ముంబై పోలీసులు సిద్ధమైనట్లు సమాచారం. దావూద్‌తో సన్నిహిత సంబంధాలున్నాయన్న ఆరోపణలపై బాలీవుడ్ నిర్మాత యూసుఫ్ లక్డావాలాను ఇప్పటికే ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లక్డావాలా నుంచి నవనీత్ దంపతులు రూ.80 లక్షలను అక్రమంగా వసూలు చేశారన్నది సంజయ్ రౌత్ ఆరోపణ. సంజయ్ రౌత్ ఆరోపణల నేపథ్యంలో నవనీత్ దంపతులపై కేసు నమోదైతే.. వారు మరింత ఇబ్బందులకు గురికాక తప్పదని వాదనలు వినిపిస్తున్నాయి.
Next Story

