Fri Dec 05 2025 21:59:34 GMT+0000 (Coordinated Universal Time)
Plane Crash : మృత్యువు ఇంటి తలుపు తట్టినా డోర్ తీయని ఆ ఏడుగురు?
అహ్మదాబాద్ లో విమానంలో ప్రయాణించడానికి రెడీ అయి చివరి నిమిషంలో ఏడుగురు మానుకోవడంతో ప్రాణాలు దక్కించుకోగలిగారు

మృత్యువు ఇంటి ద్వారం వద్దకు వచ్చి వెళ్లిపోతుందంటే ఎవరూ నమ్మరు. అయితే దీనిని ఖచ్చితంగా కొన్ని సార్లు నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే ఖచ్చితంగా మరణించే ఘటన నుంచి తప్పించుకోవడానికి అనేక కారణాలుంటాయి. అది వాళ్లంతట వాళ్లు తీసుకున్న నిర్ణయాలు కొన్ని అయితే, మరికొన్ని అవాంతరాలతో ఆగిన వారు మరికొందరు. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా ప్రమాదం ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తుంది. ఏడుగురు వివిధ కారణాలతో ప్రయాణాన్ని మానుకోవడంతో మృత్యువు నుంచి తప్పించుకున్నారు.
వందల మంది మరణించిన...
అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం జరిగి దాదాపు 276 మంది మరణించిన సంగతి తెలిసిందే. విమానంలో ఉన్న ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డారు. రమేష్ కుమార్ విశ్వాస్ ఒక్కరే అదృష్ట వశాత్తూ ప్రాణాలను దక్కించుకున్నాడు. మృత్యువును జయించాడు. ఇక అయితే ఏడుగురు ప్రయాణికులు అహ్మాదాబాద్ విమానంలోకి ఎక్కకుండానే వివిధ కారణాలతో మానుకున్నారు. దీంతో ఆ ఏడుగురు ప్రాణాలు దక్కాయని చెప్పాలి. దీంతో మృత్యువు వారి చెంతకు వచ్చి మరీ ముఖం చాటేసిందనే అనుకోవాల్సి ఉంటుంద.ి
అహ్మదాబాద్ నుంచి...
అహ్మాదాబాద్ విమాన ప్రమాదంలో ఏడుగురు తృటిలో తప్పించుకున్నారు. అందులో ఒకరు భూమి చౌహాన్. అహ్మదాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా పది నిమిషాలు ఆలస్యం కావడంతో భూమి చౌహాన్ ప్రయణించలేకపోయారు. ఇక మరో ప్రయాణకుడు తాను ఇప్పుడు ప్రయాణించలేనని ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన వయసు పెద్దది కావడంతో ఆరోగ్య సమస్య దృష్ట్యా ప్రయాణాన్ని విరమించుకున్నాడు. ఇక మరొక ఇద్దరికి వీసా, పాస్ పోర్టులు సక్రమంగా లేకపోవడంతో అధికారులు వారి ప్రయాణానికి అడ్డుచెప్పారు. ఇక మరొకరు తల్లి తన కోసం విలపిస్తుందని ఒక కుమారుడు తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు. ఇలా ఏడుగురు మృత్యువు సమీపంలోకి వచ్చినా బతికి పోయారు.
Next Story

