Sun Mar 15 2026 20:37:23 GMT+0530 (India Standard Time)
Encounter : కొనసాగుతున్న ఆపరేషన్ సాగర్.. ఏడుగురు మావోల మృతి
మహరాష్ట్ర -నారాయణపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు.

ఛత్తీస్గడ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మహరాష్ట్ర -నారాయణపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటన స్థలిలో భారీగా ఆయుధాలను భద్రతాదళాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆపరేషన్ సాగర్ పేరుతో గత కొద్ది రోజులుగా ఛత్తీస్గడ్ లో వరస ఎన్కౌంట్లు జరుగుతున్నాయి.
ఛత్తీస్గడ్ లో భారీ ఎన్కౌంటర్..
మావోయిస్టులను ఏరివేసే లక్ష్యంతో ఈ ఆపరేషన్ సాగర్ జరుగుతుందని తెలిసింది. వేసవి కాలం కావడంతో నీటి ఎద్దడి అటవీ ప్రాంతంలో తలెత్తడంతో మావోయిస్టులు గ్రామీణ ప్రాంతాలకు వచ్చి తలదాచుకుంటున్నారన్న సమాచారంతో దాడులు కొనసాగుతున్నాయి. దీంతో తెలంగాణ - ఛత్తీస్గడ్ ప్రాంతం హై అలెర్ట్ జోన్ గా మారింది. మావోలు ఈ మధ్య కాలంలో పోలీసు కాల్పుల్లో నలభై మందికి పైగానే మరణించారు.
Next Story

