Sat Mar 07 2026 21:19:55 GMT+0530 (India Standard Time)
గోల్డెన్ టెంపుల్ సమీపంలో మరోసారి పేలుడు
పంజాబ్‌లోని అమృతసర్‌లో వరుస పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. గోల్డెన్ టెంపుల్ వద్ద మూడోసారి బాంబులు పేలాయి

పంజాబ్‌లోని అమృతసర్‌లో వరుస పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. అత్యధికులు దర్శించుకునే స్వర్ణ దేవాలయం సమీపంలోనే మూడో సారి భారీ పేలుడు సంభవించింది. భారీ పేలుడు శబ్దాలతో స్వర్ణ దేవాలయం ప్రాంతం దద్దరిల్లింది. దీంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు.
మూడోసారి...
గురు రామ్‌దాస్ నివాస్ సమీపంలో నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో బాంబు పేలుళ్లు జరిగినట్లు పోలీసులు తెలిపారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలను సేకరించే ప్రయత్నంలో ఉన్నారు.
Next Story

