Thu Mar 19 2026 12:38:14 GMT+0530 (India Standard Time)
మాయా, ఒవైసీలకు భారతరత్న ఇవ్వండి
శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో గెలిచింది బీజేపీ కాదని ఆయన అన్నారు

శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో గెలిచింది బీజేపీ కాదని ఆయన అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో బీజేపీది గొప్ప విజయమేనని ఆయన ఎద్దేవా చేశారు. అఖిలేష్ యాదవ్ కు మూడు రెట్లు సీట్లు పెరిగాయని సంజయ్ రౌత్ అన్నారు.
ఆ ఇద్దరి వల్లనే.....
అఖిలేష్ యాదవ్ పార్టీకి 45 సీట్ల నుంచి 125 సీట్లు పెరగాయని సంజయ్ రౌత్ చెప్పారు. గోవాలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు, ఉత్తరాఖండ్ లో ముఖ్యమంత్రి ఎందుకు ఓటమి పాలయ్యారని ఆయన ప్రశ్నించారు. అయితే ఈ ఎన్నికల్లో మాయావతి, అసదుద్దీన్ ఒవైసీలు బీజేపీకి ఉపయోగపడ్డారని, సమాజ్ వాదీ పార్టీ ఓట్లు చీల్చి బీజేపీకి లబ్ది చేకూర్చారని సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. వీరిద్దరికి భారతరత్న, పద్మ విభూషణ్ పురస్కారాలు ఇస్తే బాగుంటుందని సంజయ్ రౌత్ సూచించారు.
Next Story

