Fri Dec 05 2025 13:36:26 GMT+0000 (Coordinated Universal Time)
Smitha Sabharwal : లాంగ్ లీవ్ లో స్మితా సబర్వాల్
సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ దీర్ఘకాలం సెలవులో వెళ్లిపోయారు

సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ దీర్ఘకాలం సెలవులో వెళ్లిపోయారు. 2026 జనవరి 31వ తేదీ వరకు స్మితా సబర్వాల్ సెలవులో ఉంటారు.స్మిత సబర్వాల్ స్థానంలో సెర్ప్ అదనపు సీఈఓగా కాత్యాయనీ దేవికి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. అనారోగ్య కారణాలతో బాధపడుతున్నట్లు, త్వరలోనే కోలుకుంటానని సోషల్ మీడియాలో స్మితా సబర్వాల్ వీడియో పోస్ట్ చేశారు.
అవే కారణాలా?
కాళేశ్వరం, కంచ గచ్చిబౌలి భూముల కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న స్మితా సబర్వాల్ తనకు ప్రాధాన్యత లేని పోస్టింగ్స్, ఇబ్బందికర పరిస్థితులు కారణంగా లాంగ్ లీవ్ పెట్టి వెళ్లినట్లు ఐఏఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలకంగా పనచేసిన స్మితా సబర్వాల్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెపై కేసులతో పాటు అప్రధాన్య పోస్టుల్లో ఉండటంతో ఆమె లాంగ్ లీవ్ పై వెళ్లిపోయారని అనుకుంటున్నారు
Next Story

