Mon Mar 16 2026 01:11:43 GMT+0530 (India Standard Time)
Congress : కాంగ్రెస్ సీనియర్ నేత మృతి
కాంగ్రెస్ సీనియర్ నేత నట్వర్ సింగ్ మరణించారు. నట్వర్ సింగ్ కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు.

కాంగ్రెస్ సీనియర్ నేత నట్వర్ సింగ్ మరణించారు. నట్వర్ సింగ్ కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. నట్వర్ సింగ్ వయసు 95 సంవత్సరాలు. ఆయన వృద్ధాప్యంలో అనారోగ్యం కారణంగా గత రెండు వారాలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో నట్వర్‌సింగ్ కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
రాజస్థాన్ లో జన్మించి....
1931 లో రాజస్థాన్ లో జన్మించిన నట్వర్‌సింగ్ కాంగ్రెస్ లో అగ్రనాయకుడిగా ఎదిగాడు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో నట్వర్‌సింగ్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన విదేశాంగ మంత్రిగా పనిచేశారు. నట్వర్‌సింగ్ మరణంతో కాంగ్రెస్ ఒక తరం నేతను కోల్పోయిందని నేతలు అన్నారు. ఆయన మృతిపట్ల అగ్రనేతలు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Next Story

