Sat Dec 13 2025 14:29:45 GMT+0000 (Coordinated Universal Time)
భద్రతాదళాల స్వాధీనంలోకి కర్రెగుట్టలు
కర్రెగుట్టలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతుంది. భద్రతా బలగాల ఆధీనంలో రెండు గుట్టలు చేరిపోయాయి

కర్రెగుట్టలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతుంది. భద్రతా బలగాల ఆధీనంలో రెండు గుట్టలు చేరిపోయాయి. కర్రెగుట్టలపై జాతీయ జెండా ఎగురవేసిన బలగాలు తాము స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించాయి. అయితే అక్కడ మావోయిస్టులు మాత్రం కనిపించకపోవడంతో భద్రతాదళాలు కర్రెగుట్ట ప్రాంతమంతా జల్లెడ పడుతుంది.
శాశ్వత బేస్ క్యాంప్లు...
శాశ్వత బేస్ క్యాంప్లు ఏర్పాటు దిశగా భద్రతాదళాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. కర్రెగుట్టలో 20 వేల మందికిపైగా భద్రతా బలగాల సిబ్బంది ఉన్నారు. కొందరు అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పంపించి వేసి కొత్త వారిని రప్పించారు. కొందరికి వడదెబ్బ తగలడంతో జ్వరంతో బాధపడుతుండగా వారిని పంపించి వేసినట్లు చెబుతును్నారు. అయితే మావోయిస్టు కీలక నేతల ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదని తెలిసింది.
Next Story

