Fri Dec 05 2025 10:51:58 GMT+0000 (Coordinated Universal Time)
మణిపూర్ లో నలుగురు ఉగ్రవాదులు అరెస్ట్
మణిపూర్ లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి

మణిపూర్ లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. జాతీయ రహదారి సంస్థ వెంట వాహనదారులను బెదిరించి డబ్బు వసూళ్లకు పాల్పుడుతున్న నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. నిషేధిత సంస్థకు చెందిన ఉగ్రవాదులుగా వారిని గుర్తించారు. దోపిడీలకు పాల్పడుతూ పలువురిని భయాందోళనలకు గురి చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.
జాతీయ రహదారిపై...
నిషేధిత సంస్థ ప్రీపాక్, ఎన్ఎస్సీఎన్ నుంచి ఒక్కొక్కరు చొప్పున పోలసీులు అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. రెండేళ్ల క్రితం మణిపూర్ లో జాతుల మధ్య హింస చెలరేగినప్పటి నుంచి ఉగ్రవాదుల కోసం భద్రతాదళాలు గాలిస్తున్నాయి. చివరకు నలుగురు మాత్రమే అరెస్ట్ చేశారు. వీరిని విచారించి మిగిలిన వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారని తెలిసింది.
Next Story

