Sat Dec 06 2025 07:51:51 GMT+0000 (Coordinated Universal Time)
మణిపూర్ లో ప్రారంభమైన పోలింగ్
మణిపూర్ లో నేడు రెండో విడత పోలింగ్ కొద్ది సేపటి క్రితం ప్రారంభమయింది

మణిపూర్ లో నేడు రెండో విడత పోలింగ్ కొద్ది సేపటి క్రితం ప్రారంభమయింది. ఈ విడతతో మణిపూర్ లో అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసినట్లే. రెండో విడతలో ఆరు జిల్లాల్లోని 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 92 మంది అభ్యర్థులు ఈ పోటీలో ఉన్నార. 8.38 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయమే పోలింగ్ ప్రారంభం కావడంతో ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరారు.
రెండో విడతలో....
ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ మాత్రమే పోలింగ్ జరుగుతుంది. ఇందుకోసం 1,247 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మొత్తం 60 నియోజకవర్గంలో మొదటి దశలో 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించారు. వీటిలో 12 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. రెండో దశలో 22 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది.
Next Story

