Mon Feb 02 2026 05:28:52 GMT+0000 (Coordinated Universal Time)
క్యూ లైన్ లో నిల్చుని మోదీ
గుజరాత్ లో రెండో విడత పోలింగ్ జరుగుతుంది. ప్రధాని నరేంద్రమోదీ అహ్మదాబాద్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు

గుజరాత్ రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ప్రధాని నరేంద్రమోదీ అహ్మదాబాద్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాణిప్లోని నిషాన్ పబ్లిక్ స్కూల్ కు వచ్చిన మోదీ కాన్వాయ్ ను కొద్ది దూరంలో నిలిపి వేసి మరీ పోలింగ్ కేంద్రానికి నడుచుకుంటూ వచ్చారు. సామాన్య ప్రజలతో కలసి ఆయన తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మోదీ క్యూ లైన్ లో నిలబడి మరీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రశాంతంగా....
రెండో విడతగా గుజరాత్ లో 93 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. దీంతో మొత్తం 182 స్థానాలకు పోలింగ్ ముగిసినట్లే. ఈ నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ జరగనుంది. గుజరాత్ లోని 14 జిల్లాల్లో జరుగుతున్న పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. మొత్తం 833 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు 26,409 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశఆరు.
Next Story

