Wed Jan 28 2026 23:49:49 GMT+0000 (Coordinated Universal Time)
గుజరాత్ లో పోలింగ్ ప్రారంభం
గుజరాత్ లో రెండో దశ పోలింగ్ ప్రారంభమయింది. ఈ దశలో 93 స్థానాలకు పోలింగ్ జరగనుంది

గుజరాత్ లో రెండో దశ పోలింగ్ ప్రారంభమయింది. ఈ దశలో 93 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 14 జిల్లాల పరిధిలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జగనుంది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేభారు.
ఓటు హక్కును ...
ఈ దశలోనే అహ్మదాబాద్, గాంధీనగర్ వంటి ప్రాంతాల్లో పోలింగ్ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ లో తన ఓబు హక్కును వినియోగించుకోనున్నారు. తొలిదశలో 89 స్థానాలకు ఎన్నికలు జరగగా, రెండో దశలో 93 స్థానాలకు జరుగుతున్నాయి. మొత్తం 182 స్థానాల్లో జరుగుతున్న ఎన్నికల్లో 91 సీట్లు మ్యాజిక్ ఫిగర్. గత ఎన్నికల్లో బీజేపీ చచ్చీ చెడీ గెలిచింది. ఈసారి ఆమ్ఆద్మీ, కాంగ్రెస్ పార్టీ పోటీ పడుతున్నాయి.
Next Story

