Thu Jan 29 2026 00:52:06 GMT+0000 (Coordinated Universal Time)
Schools Holiday: జులై 27 నుండి ఆగస్టు 2 వరకు సెలవులు
కన్వర్ యాత్రలో శివ భక్తుల కారణంగా హరిద్వార్‌లోని

కన్వర్ యాత్రలో శివ భక్తుల కారణంగా హరిద్వార్‌లోని పాఠశాలలు జూలై 27 నుండి ఆగస్టు 2 వరకు మూసివేయనున్నారు. పవిత్ర గంగా నదీ జలాల సేకరణ కోసం తరలివస్తున్న భక్తులతో కన్వర్ యాత్ర సోమవారం ప్రారంభమైంది. రాబోయే కొద్ది రోజుల్లో రద్దీ పెరగనున్నందున పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ ధీరాజ్ సింగ్ గర్బియాల్ తెలిపారు.
జిల్లాలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలు, అంగన్వాడీ స్కూల్స్.. జులై 27 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు మూసివేయనున్నారు. కన్వర్ యాత్ర కోసం విస్తృతమైన ఏర్పాట్లకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు. అనేక ప్రదేశాలలో రద్దీ ఉంటుందని అధికారులు తెలిపారు.
Next Story

