చూపు లేకపోయినా చెస్ లో రాణిస్తున్న సానియా
14 ఏళ్ల సానియా ఖాతూన్ కంటిచూపు లేకపోయినా చెస్ లో అద్భుతంగా రాణిస్తోంది. జాతీయ స్థాయి చెస్ పోటీల్లో టాప్ -10 స్థానాల్లో నిలిచి అబ్బురపరుస్తోంది.

14 ఏళ్ల సానియా ఖాతూన్ కంటిచూపు లేకపోయినా చెస్ లో అద్భుతంగా రాణిస్తోంది. జాతీయ స్థాయి చెస్ పోటీల్లో టాప్ -10 స్థానాల్లో నిలిచి అబ్బురపరుస్తోంది. పశ్చిమ బెంగాల్ అసన్సోల్ పట్టణానికి సమీపంలోని జమూరియా గ్రామం వీళ్లది. నిరుపేద కుటుంబం. సానియాకు పుట్టుకతోనే చూపు లేదు. చిన్న వయసులోనే తండ్రి చనిపోయారు. అసన్సోల్ పట్టణంలో ఉన్న బ్రెయిలీ అకాడమీ గురించి సానియా తల్లికి తెలిసింది. అక్కడ అంధ విద్యార్థులకు చదువు, వసతి, దుస్తులు, ఆహారం, పుస్తకాలు అన్నీ ఉచితంగా ఉంటాయని తెలియడంతో అందులో సానియా ఖాతూన్‌ను చేర్పించింది. కంటిచూపు లేకపోయినా చదువులతో పాటు చెస్ గేమ్‌లో కూడా ఎదిగింది సానియా. కోల్‌కతా నుంచి వచ్చిన స్పెషల్ కోచ్, అసన్సోల్కు చెందిన స్థానిక కోచ్‌ల సాయం ఎంతో ఉంది. జిల్లా, రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో అద్భుతంగా రాణించడంతో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అరుదైన అవకాశం ఆమెకు దక్కింది. పలు రాష్ట్రాల్లో జరిగిన జాతీయ స్థాయి చెస్ పోటీల్లో సానియా పాల్గొని టాప్-10 స్థానాల్లో చోటును సంపాదించింది.

