Thu Mar 19 2026 07:58:34 GMT+0530 (India Standard Time)
ములయాం అంత్యక్రియలకు కేసీఆర్, చంద్రబాబు
సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు నేడు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు

సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు నేడు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. ములాయం అంత్యక్రియలు నేడు ఉత్తర్ప్రదేశ్ లోని సైఫాయి గ్రామంలో జరగనున్నాయి. ఈ అంత్యక్రియలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. ఆయనకు ఘన నివాళులర్పించనున్నారు. ములాయం కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించనున్నారు.
నివాళులర్పించి...
ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి సైఫాయి గ్రామానికి చేరుకుని ములాయం భౌతిక కాయానికి నివాళులర్పించనున్నారు. అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం తిరిగి ఢిల్లీ చేరుకుని చంద్రబాబు రాత్రికి విజయవాడకు చేరుకుంటారు.
Next Story

