Sun Mar 15 2026 21:54:50 GMT+0530 (India Standard Time)
ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు... అఖిలేష్ సంచలన ఆరోపణ
సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఎన్నికల కమిషన్ ను నమ్మడం లేదన్నారు

సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఎన్నికల కమిషన్ ను నమ్మడం లేదన్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు. ఎన్నికలకు ముందే ఈవీఎలను ట్యాంపరింగ్ చేశారని అఖిలేష్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ కు ముందే ఈవీఎంలను తరలిస్తున్నారని పేర్కొన్నారు.
ఎన్నికల కమిషన్ అధికారులే....
ఉత్తర్ ప్రదేశ్ లో ఏడు దశల్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత అఖిలేష్ యాదవ్ ఈ ఆరోపణలు చేయడం విశేషం. ఎన్నికల కమిషన్ అధికారులే ఈవీఎంలను మార్చారని చెప్పారు. ఎన్నికల అధికారులతో బీజేపీ నాయకులు కుమ్మక్కయ్యారన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Next Story

