Sun Mar 15 2026 03:28:41 GMT+0530 (India Standard Time)
గోవాలో బీజేపీకి షాక్.. ఇద్దరు జంప్
గోవాలో అధికార బీజేపీకి షాక్ తగిలింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్రమంత్రితో పాటు, ఎమ్మెల్యే రాజీనామా చేశారు.

గోవాలో అధికార భారతీయ జనతా పార్టీకి షాక్ తగిలింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్రమంత్రితో పాటు, ఎమ్మెల్యే రాజీనామా చేశారు. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశముంది. గోవా ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి బీజేపీ, కాంగ్రెస్ లతో పాటు ప్రాంతీయ పార్టీలైన టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ వంటివి కూడా పోటీ పడుతున్నాయి.
ఎన్నికలు....
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మంత్రి మైఖేలే లోబో పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే ప్రవీణ్ కూడా రాజీనామా చేశారు. దీంతో బీజేపీ కంగుతినింది. ఎన్నికల సమయంలో రాజీనామాలు బీజేపీని చికాకుపెడుతున్నాయి. వీరిద్దరూ కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం జరుగుతుంది.
Next Story

