Fri Dec 05 2025 14:42:41 GMT+0000 (Coordinated Universal Time)
Delhi : ఢిల్లీ విమానాశ్రయంలో కూలిన పై కప్పు
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ వన్ లోని పైకప్పు కూలింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు

దేశ రాజధాని ఢిల్లీలో ఈదురుగాలులు, భారీ వర్షంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ వన్ లోని పైకప్పు కూలింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. శిధిలాల కింద ఒకరు చిక్కుకోవడంతో అతడిని సహాయక సిబ్బంది వెంటనే రక్షించారు. అనేక కార్లపై పైకప్పు భాగాలు పడటంతో అవి దెబ్బతిన్నాయి.
టెర్మినల్ వన్ నుంచి...
ఈరోజు తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనతో ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 1లో చెక్ ఇన్ లు నిలిపేశారు. అక్కడ నుంచి వెళ్లేందుకు ఎవరినీ అనుమతించడంలేదు. ఢిల్లీ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. ీవర్షాలు కురుస్తుండటంతో పాటు ఈదురుగాలులు వీస్తుండటంతో సహాయక సిబ్బంది ప్రత్యేకచర్యలు చేపట్టారు. మరోవైపు గత రెండు రోజులుగా ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు తోడు ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Next Story

