Fri Dec 05 2025 17:04:15 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్బీఐ కీలక ప్రకటన.. త్వరలో డిజిటిల్ కరెన్సీ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి త్వరలో తేనున్నట్లు ప్రకటించింది

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి త్వరలో తేనున్నట్లు ప్రకటించింది. త్వరలో ప్రయోగాత్మకంగా డిజిటల్ రూపీని విడుదల చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇది వినియోగదారులకు అదనపు చెల్లింపు మార్గంగా ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న చెల్లింపుల వ్యవస్థ అలాగే కొనసాగుతుందని ఆర్బీఐ వినియోగదారులకు స్పష్టం చేసింది.
ప్రజల్లో అవగాహన....
డిజిటల్ కరెన్సీ పై ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. దీనికి e₹ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఉన్న కరెన్సీకి ఇది అదనంగా ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీనివల్ల సులభంగా, చౌకగా, వేగంగా చెల్లింపు చేయవచ్చని పేర్కొంది. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొంది. ఈ కరెన్సీ చట్టబద్ధంగా ఎక్కడైనా చెల్లుబాటు అవుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.
Next Story

