Wed Mar 18 2026 19:45:03 GMT+0530 (India Standard Time)
నేటి నుంచి జేఈఈ రిజిస్ట్రేషన్లు
నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. మే 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు

నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఈరోజు నుంచి మే 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 8 వరకు ఫీజు చెల్లించే అవకాశాన్ని కల్పించారు. అడ్మిట్ కార్డులు మే 29 నుంచి జూన్ 4 వరకు డౌన్లోడ్ చేసుకునే వీలుంటుందని అధికారులు తెలిపారు.
పరీక్షలు ఇలా...
జూన్ 4న ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్ 2 పరీక్ష ఉంటుందని తెలిపారు. ప్రైమరీ ఆన్సర్ కీ జూన్ 11న విడుదల చేయనున్నారు. అలాగే ఫలితాలను జూన్ 18న విడుదల చేస్తామని ఐఐఐటీ గౌహతికి చెందిన అధికారులు పేర్కొన్నారు.
Next Story

