Sun Mar 08 2026 04:45:15 GMT+0530 (India Standard Time)
Ratan Tata: రతన్ టాటా ఆరోగ్యంపై వదంతులు.. నిజం ఇదే!
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా ఆరోగ్యంపై వస్తున్న వదంతుల్లో

టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా ఆరోగ్యంపై వస్తున్న వదంతుల్లో ఎలాంటి నిజం లేదని తేలింది. ఆయన ఆసుపత్రిలో చేరినట్లు వచ్చిన నివేదికలను తోసిపుచ్చారు. బాగానే ఉన్నానని ఇన్స్టాగ్రామ్లో తన ఫాలోవర్లకు తెలిపారు. 86 ఏళ్ల పారిశ్రామికవేత్త రతన్ టాటా పరిస్థితి విషమంగా ఉందని ఉదయం 12.30-1.00 గంటలకు ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే రతన్ టాటా తన వయస్సు కారణంగా సాధారణ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు.
తన ఆరోగ్యం గురించి ఇటీవల వస్తున్న పుకార్లను నమ్మకండని రతన్ టాటా తెలిపారు. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా ప్రస్తుతం కొన్ని వైద్యపరమైన పరీక్షలు చేయించుకుంటున్నానన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని వివరించారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని కోరుతున్నానని రతన్ టాటా సోషల్ మీడియా పోస్ట్ లో తెలిపారు.
Next Story

