Fri Dec 05 2025 23:15:19 GMT+0000 (Coordinated Universal Time)
Jamili : జమిలీకి జై కొడుతున్నారట
దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు మద్దతు బాగా ఉందని మాజీ రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ కమిటీ పేర్కొంది

దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు మద్దతు బాగా ఉందని మాజీ రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ కమిటీ పేర్కొంది. ఒకే దేశం - ఒకే ఎన్నిక నిర్వహణ సాధ్యాసాధ్యాలపై నియమించిన కమిటీ వివిధ వర్గాలతో సమావేశం అవుతుంది. అయితే దాదాపు ఎక్కువ శాతం మంది జమిలి ఎన్నికలకు మొగ్గు చూపుతున్నారని కమిటీ అభిప్రాయపడింది. విశ్రాంత న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలతో నాలుగో విడతగా ఈ కమిటీ సంప్రదింపులు జరిపిందని కమిటీ తెలిపింది.
ఎక్కువ మంది అభిప్రాయం...
అయితే ఇప్పటి వరకూ జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై తమ అభిప్రాయాలను తెలపాలని దేశంలో ఉన్న రాజకీయ పార్టీలను కోరింది. మొత్తం 46 రాజకీయ పార్టీల నుంచి సూచనలు, సలహాలను కోరింది. అయితే పదిహేడు పార్టీల నుంచి మాత్రమే ఈ మేరకు రెస్పాన్స్ వచ్చిందని కమిటీ తెలిసింది. ప్రజల నుంచి వచ్చిన స్పందనలో దాదాపు 81 శాతం మంది జమిలీ ఎన్నికలకు మద్దతుగా నిలిచారని కమిటీ తెలిపింది. అయితే లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ జమిలి ఎన్నికలు ఈసారి సాధ్యమా? అన్న ప్రశ్న కూడా మరోవైపు తలెత్తుంది.
Next Story

