Wed Jan 21 2026 02:44:25 GMT+0000 (Coordinated Universal Time)
ఉపరాష్ట్రపతి పదవిపై రజనీ కీలక వ్యాఖ్యలు
ఉపరాష్ట్రపతి పదవిపై నటుడు సూపర్‌స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వెంకయ్యనాయుడికి ఆ పదవి ఇవ్వడం తనకు నచ్చలేదన్నారు

ఉపరాష్ట్రపతి పదవిపై నటుడు సూపర్‌స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వెంకయ్యకి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు నచ్చలేదని తెలిపారు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ ఈ కామెంట్స్ చేశారు. గొప్పనాయకుడిని రాజకీయాల నుంచి దూరం చేశారని రజనీ కాంత్ వ్యాఖ్యానించారు. ఉపరాష్ట్రపతి హోదాలో ఎలాంటి అధికారాలు ఉండవని, చాలా విషయాల్లో ప్రోటోకాల్ కండిషన్స్ ఉంటాయని అన్నారు.
తాను కూడా...
తాను ఉపరాష్ట్రపతి పదవిని కించపరచడం లేదని, వెంకయ్యనాయుడు మరికొన్ని రోజులపాటు కేంద్రమంత్రిగా కొనసాగివుంటే బాగుండేదని సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. అదేసభలో మాట్లాడిన వెంకయ్య నాయుడు మాట్లాడుతూ రజనీకాంత్ ను రాజకీయాల్లోకి రావద్దని తాను చెప్పినట్లు అన్నారు. ఆయన మంచి నటుడని మరికొన్ని రోజులు ప్రజలను అలరించాలని కోరానన్నారు. రాజకీయాల్లో మాత్రమే కాకుండా ఇతర మార్గాల్లో సేవలను అందించవచ్చని వెంకయ్య నాయుడు అన్నారు.
Next Story

