Wed Mar 04 2026 09:28:21 GMT+0530 (India Standard Time)
లక్షల కోట్లకు అధిపతి..అయినా సామాన్య భక్తురాలిగానే
లక్ష కోట్లకు అధిపతి అయినప్పటికీ దేవుడంటే భక్తితో ఆలయానికి సాదాసీదాగా వచ్చి దర్శనం చేసుకుని వెళుతుంటారు

లక్ష కోట్లకు అధిపతి అయినప్పటికీ దేవుడంటే భక్తితో ఆలయానికి సాదాసీదాగా వచ్చి దర్శనం చేసుకుని వెళుతుంటారు. ఈమె త్రివేండ్రం రాజవంశీకురాలు.. అక్కడి స్థానిక ప్రజలు ఈమెను రాణి అని పిలుస్తారు. కానీ ఆమె మాత్రం తాను దేవుడికి దాసిని అని చెబుతుంది. తమ కుటుంబం కేరళలో కట్టించిన ఆలయాలకు ప్రతిరోజూ, వేల సంఖ్యలో వస్తారు..
ఆలయాన్నిశుభ్రపర్చి...
రాజ భవనం నుంచి వెంట ఒక్క మనిషి కూడా లేకుండా దర్శనానికి ఈమె ఒంటరిగా వస్తుంది. భక్తులకు ఇబ్బంది కలిగించకుండా దూరం నుంచే దైవ దర్శనం చేసుకుని, అందరికీ నమస్కారం చేస్తూ వెళుతుంది. ఆమె ఎవరో తెలియని వారు ఆమె ఆలయం చిమ్మే పనిమనిషి అనుకుంటారు. ఎందుకంటే వస్తూనే ఆలయంలో చీపురు పట్టి శుభ్రం చేస్తుంది. కానీ ఆమె లక్షలకోట్ల అధిపతి అని, రాజవంశానికి చెందిన వారని ఎవరికీ తెలియదు.
Next Story

