Sat Dec 06 2025 12:23:16 GMT+0000 (Coordinated Universal Time)
Vandebharath : గుడ్ న్యూస్.. వచ్చే నెలలో వందేభారత్ స్లీపర్ రైలు
రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే వందే భారత్ స్లీపర్ సర్వీసులు ప్రారంభిస్తామని ప్రకటించారు.

రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే వందే భారత్ స్లీపర్ సర్వీసులు ప్రారంభిస్తామని అశ్వని వైష్ణవ్ ప్రకటించారు. అయితే ఇప్పటికే ఒక వందేభారత్ స్లీపర్ రైలు సిద్ధమయిందన్నారు. రెండో వందేభారత్ స్లీపర్ రైలు కూడా తయారవుతుందని, అది అందుబాటులోకి రాగానే పట్టాలపైకి ఎక్కుతుందని తెలిపారు. రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ చెప్పారు. ఇప్పటికే స్లీపర్ కోచ్ లతో కూడిన రైలుకు సంబంధించిన సాంకేతిక పరీక్షలు పూర్తయినట్లు కూడా రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు.
దక్షిణాదికి ఒకటి...
అయితే రెండో వందేభారత్ రైలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ స్లీపర్ సర్వీసులను ప్రారంభిస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ వివరించారు. సుమారుగా వచ్చే నెల పదిహేనో తేదీ నాటికి మరో రైలు సిద్ధమవుతుందని తెలిపారు. అయితే ఈ రైలు ఎక్కడి నుంచి ప్రారంభిస్తామన్నది కూడా త్వరలోనే వెల్లడిస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. ఒకటి దక్షిణాదిన, మరొకటి ఉత్తరాదిన వందే భారత్ స్లీపర్ రైలు ఉండే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు.
Next Story

