Sat Mar 07 2026 20:10:47 GMT+0530 (India Standard Time)
రైలు ప్రమాదంలో మృతులు వీరే
విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో మొత్తం పది మంది వరకూ మరణించినట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది

విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో మొత్తం పది మంది వరకూ మరణించినట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. వీరిలో ఆరుగురిని గుర్తించినట్లు వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్ తెలిపారు. నిన్న రాత్రి విజయనగరం జిల్లాలో రెండు ప్యాసెంజర్ రైళ్లు ఢీకొన్న ఘటనలో పది మంది మరణించగా, 54 మంది గాయపడినట్లు రైల్వే శాఖ అధికారికంగా తెలిపింది. గాయపడిన వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది.
మృతులు :
అప్పలనాయుడు
కాపు సంభం
చల్లా సతీష్
కె. రవి
జి. లక్ష్మి
బలలరాం
Next Story

