Fri Dec 05 2025 13:17:32 GMT+0000 (Coordinated Universal Time)
టెన్త్ చదివారా. ..రైల్వేలో 32,438 ఉద్యోగాలకు నోటిఫికేషన్
రైల్వే శాఖ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. టెన్త్ చదివితే చాలు ఈ ఉద్యోగానికి అర్హులు.

రైల్వే శాఖ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. టెన్త్ చదివితే చాలు ఈ ఉద్యోగానికి అర్హులు. రైల్వేలో 32,438 ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుకు గడువు రేపటితో ముగియనుంది. అయితే రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు దరఖాస్తులు స్వీకరణ తేదీని మరో వారం రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులుు జారీ చేసింది. మార్చి ఒకటో తేదీ వరకూ ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలేంటంటే?
పదో తరగతి లేదా ఐటీఐ పాస్ అయిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా నిర్ణయించారు. గ్రూప్ డీపోస్టులయిన ఈ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థి వయసు 18 ఏళ్ల నుంచి 36 ఏళ్ల వయసులోపు ఉండాలి. ఎంపికకు సంబంధించి సీబీటీ, పీఈటీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో పాటు మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు https://www.rrbapply.gov.in/ వెబ్ సైట్ లో చూడొచ్చు. ఈ వెబ్ సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింద.ి
Next Story

