Tue Jan 21 2025 18:55:43 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్ జోడో యాత్రలో ఉత్సాహం.. గుడ్ రెస్పాన్స్
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేడు తమిళనాడు కు చేరుకుంటుంది
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేడు తమిళనాడు కు చేరుకుంటుంది. కేరళలో ప్రస్తుతం పర్యటిస్తున్న రాహుల్ గాంధీ పాదయాత్ర తమిళనాడుకు చేరుకుంటుంది. రాహుల్ గాంధీ యాత్ర నేడు 23వరోజుకు చేరుకుంది. ఆయన కేరళలో కొద్దిరోజులుగా పర్యటిస్తున్నారు. రాహుల్ పాదయాత్రకు మంచి స్పందన లభిస్తుంది. సామాన్య ప్రజల నుంచి అన్ని వర్గాల వారినీ ఆయన కలుస్తున్నారు. ఆయనను చూసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. కేరళలో మంచి రెస్పాన్స్ లభిస్తుంది.
వయసుతో సంబంధం లేకుండా...
అందుకు వయసుతో సంబంధం లేదు. చిన్న వయసు నుంచి వృద్ధుల వరకూ రాహుల్ ను చూసి పలుకరించేందుకుద పాదయాత్ర వద్దకు చేరుకుంటున్నారు. దీంతో రాహుల్ గాంధీ పాదయాత్రలో ఆయన అనేక అనుభవాలను చూస్తున్నారు. వారితో మాట్లాడుతున్నారు. చిన్న పిల్లలను దగ్గరకు తీసుకుంటున్నారు. వారితో కలసి ఫొటోలు తీసుకునేందుకు అంగీకరిస్తుండటంతో పాదయాత్ర ఆలస్యమవుతుంది. రాహుల్ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరో రెండు రోజుల్లో తమిళనాడు నుంచి రాహుల్ పాదయాత్ర కర్ణాటకలో ప్రవేశించనుంది.
Next Story