Sun Mar 08 2026 06:21:53 GMT+0530 (India Standard Time)
నేడు కేరళలోకి రాహుల్ పాదయాత్ర
కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతుతంది. ఈరోజు రాత్రికి కేరళలోకి పాదయాత్ర ప్రవేశించనుంది

కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతుతంది. ఈరోజు రాత్రికి కేరళలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి రాహుల్ గాంధీ 12 కిలోమీటర్ల మేర నడిచి లంచ్ బ్రేక్ కు ఆగారు. కన్యాకుమారి జిల్లా మార్తాండం లోని నేసమని క్రిస్టియన్ మెమోరియల్ కళాశాలలో రాహుల్ మధ్యాహ్నం బస చేశారు. రోజుకు 25 కిలోమీటర్ల మేర ఆయన నడక కొనసాగిస్తున్నారు.
రోజుకు 25 కి.మీ....
అనంతరం నాలుగు గంటలకు రాహుల్ పాదయాత్ర ప్రారంభం కానుంది. త్రివేండ్రం దగ్గరలోని చెరువర కోణం నుంచి ఈరోజు రాత్రికి కేరళలోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించనుంది. కేరళలో రాహుల్ కు పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశారు. కేరళలో 19 రోజుల పాటు రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. కేరళలో 457 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర కొనసాగుతుంది.
Next Story

