Sun Dec 07 2025 00:20:39 GMT+0000 (Coordinated Universal Time)
170 కిమీలకు చేరిన రాహుల్ యాత్ర
కేరళలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతుంది. నేడు పాదయాత్ర పదో రోజుకు చేరుకుంది.

కేరళలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతుంది. నేడు పాదయాత్ర పదో రోజుకు చేరుకుంది. రాహుల్ గాంధీ ఇప్పటి వరకూ 170 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేశారు. రోజుకు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారు. ఉదయం ప్రారంభవుతున్న ఈ యాత్ర మధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ సాగుతుంది. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమై రాత్రి ఏడు గంటల వరకూ జరుగుతుంది.
సమస్యలను అడిగి....
కేరళలో నిన్న రాత్రి బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. పాదయాత్రలో మధ్యలో ప్రజలను కలుసుకుంటూ రాహుల్ గాంధీ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. కొందరు నేరుగా వచ్చి రాహుల్ గాంధీతో మాట్లాడుతూ తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. ఈ యాత్రలో ఆ ప్రాంతంలో ముఖ్యులను కూడా రాహుల్ గాంధీ కలిసి వారి ఆశీర్వచనాలను తీసుకుంటున్నారు.
Next Story

