Sat Mar 07 2026 23:57:43 GMT+0530 (India Standard Time)
కేజ్రీవాల్ ఇంటికి రాహుల్ గాంధీ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి కాసేపట్లో రాహుల్ గాంధీ చేరుకోనున్నారు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి కాసేపట్లో రాహుల్ గాంధీ చేరుకోనున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వనున్నారు. నిన్న రాత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను ఈడీ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆయనకు ఈరోజు ఉదయం వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు ప్రవేశపెట్టనున్నారు.
అక్రమ అరెస్ట్ అని...
దీంతో కేజ్రీవాల్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని, రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఆయనను అరెస్ట్ చేశారని రాహుల్ తెలిపారు. ఆయన ఇంటికివెళ్లి కుటుంబ సభ్యులను అరెస్ట్ గురించి అడిగి తెలుసుకోనున్నారు. అయితే ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు హైఅలెర్ట్ ను ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగే అవకాశముండటంతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
Next Story

