Sun Mar 15 2026 16:56:24 GMT+0530 (India Standard Time)
రాహుల్ యాత్రకు మూడు రోజులు బ్రేక్
రేపు మధ్యాహ్నం నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు విరామం ప్రకటించనున్నారు

రేపు మధ్యాహ్నం నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు విరామం ప్రకటించనున్నారు. మూడు రోజుల పాటు బ్రేక్ ఇవ్వనున్నారు. రేపు ఉదయం రాహుల్ తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తారు. ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకూ రాహుల్ పాదయాత్ర జరగనుంది. అనంతరం మూడు రోజుల పాటు విరామం ప్రకటించారు. దీపావళి పండగ కావడంతో ఆయన విరామం తీసుకోనున్నారు.
దీపావళికి....
రేపు ఉదయం తెలంగాణలో పది కిలోమీటర్ల మేర యాత్ర సాగుతుంది. తిరిగి బుధవారం నుంచి జోడో యాత్ర ప్రారంభమవుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. గత నెల 7వ తేదీన కన్యాకుమారిలో ప్రారంభమైన రాహుల్ యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సక్సెస్ ఫుల్ గా జరిగింది. రాహుల్ ను చూసేందుకు వేలాది మంది జనం యాత్ర వద్దకు తరలి వచ్చారు. దీంతో తెలంగాణలోనూ యాత్ర సక్సెస్ ఫుల్ గా సాగుతుందన్న అంచనాలు ఉన్నాయి.
Next Story

